అంతరిక్షానికి వెళ్లే భారతీయులు వీరే..

నవతెలంగాణ-హైదరాబాద్ : భారత్‌ ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన తొలి మానవసహిత అంతరిక్ష యాత్ర గగన్‌యాన్‌ కోసం ఎంపికైన వ్యోమగాముల పేర్లను ప్రధాని మోడీ ప్రకటించారు. భారత వాయుసేనకు చెందిన గ్రూప్‌ కెప్టెన్లు ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్‌, అంగద్‌ ప్రతాప్‌, అజిత్ కృష్ణన్‌, వింగ్‌ కమాండర్‌ సుభాన్షు శుక్లా వ్యోమనౌకలో రోదసీలోకి వెళ్లనున్నారు. భారత నేల నుంచి స్వదేశీ వ్యోమనౌకలో అంతరిక్షంలోకి వెళ్లనున్న మొదటి భారతీయ బృందంగా వీరు ఘనత దక్కించుకోనున్నారు. గతంలో రాకేశ్‌శర్మ భారత్‌ తరఫున అంతరిక్షంలోకి వెళ్లిన తొలి వ్యోమగామిగా రికార్డు సృష్టించారు. అయితే ఆయన రష్యా ప్రయోగకేంద్రం నుంచి వెళ్లిన నౌకలో ఈ ఘనత అందుకున్నారు.

Spread the love