కాంగ్రెస్‌ పార్టీ లోక్‌సభ పరిశీలకులు వీరే..

నవతెలంగాణ – ఢీల్లి: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేస్తోన్న కాంగ్రెస్‌  పార్టీ అధిష్ఠానం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో ఈ సంవత్సరం చివర్లో జరగనున్న ఎన్నికల సన్నాహాలను పర్యవేక్షించేందుకు లోక్‌సభ నియోజకవర్గాల వారీగా ఏఐసీసీ పరిశీలకులను నియమించింది. వీరి నియామక ప్రతిపాదనకు కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ఆమోదం తెలిపినట్టు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ ఓ ప్రకటనలో తెలిపారు. వీరి నియామకం తక్షణమే అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు.

Spread the love