ప్రతి స్త్రీ జీవితంలో గర్భం అనేది చాలా ముఖ్యమైన సమయం. ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. తల్లి, పుట్టబోయే బిడ్డ ఇద్దరి ఆరోగ్యం కోసం ఈ సమయంలో తల్లి శరీరంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని వైద్యులు చెబుతున్నారు. అందుకోసం కొన్ని ఆంక్షలను పాటించాల్సి వస్తుంది. నడవడం, నిద్రపోవడం, తినడం, రోజువారీ అలవాట్లు, వీటన్నింటికీ ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం ముఖ్యం. కాబట్టి, ఈ సమయంలో ఆరోగ్యంగా ఉండటానికి గర్భిణీ స్త్రీ చేయకూడని కొన్ని పనులు ఏంటంటే…
– గర్భధారణ సమయంలో ఉడికించని మాంసం, పొగబెట్టిన సీఫుడ్, పచ్చి గుడ్లు, మెత్తని జున్ను, పాశ్చరైజ్ చేయని పాల ఉత్పత్తులకు దూరంగా ఉండాలి.
– కెఫిన్ తీసుకోవడం వలన గర్భిణీ స్త్రీలలో అధిక రక్తపోటు, తరచుగా మూత్రవిసర్జన, హదయ స్పందన రేటు పెరుగుతుంది.
– మెడిసిన్ గర్భధారణ సమయంలో తీసుకుంటే పిండానికి హాని కలిగించే కొన్ని మందులు ఉన్నాయి. కాబట్టి ఏదైనా ఔషధం తీసుకునే ముందు తప్పకుండా మీ వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం.
– పెయింట్లలో పెద్ద మొత్తంలో విష రసాయనాలు, హానికరమైన ద్రావకాలు ఉంటాయి, ఇవి గర్భిణుల ఆరోగ్యానికి అత్యంత హానికరం, పిండానికి హాని కలిగిస్తాయి. కాబట్టి వాటికి దూరంగా ఉండాలి
– గర్భధారణ సమయంలో అసౌకర్యంగా అనిపించే బూట్లు ధరించవద్దు. అది సురక్షితం కాదు. ముఖ్యంగా హీల్స్ చెప్పులు వాడకపోవడమే ఉత్తమం. ఇవి శరీరంలోని నరాల మీద ఒత్తిగిడి పెంచి సమస్యలకు దారితీస్తాయి.
– ధూమపానం, మద్యం సేవించడం వంటి హానికరమైన అలవాట్లు తల్లి, పిండానికి చాలా హాని కలిగిస్తాయి. నిరంతర ధూమపానం గర్భస్రావం, అకాల ప్రసవం, ఇతర సమస్యలకు కూడా దారితీస్తుంది.
– ఎక్కువసేపు నిలబడటం లేదా కూర్చోవడం గర్భిణులకు పాదాల వాపు, సిర సమస్యలకు కారణమవుతుంది. కూర్చోవడంలో సమస్య ఉంటే, ఎప్పటికప్పుడు కాస్త విరామం తీసుకుంటూ ఉండాలి. అదే పనిగా కూర్చుని ఉండకూడదు. కూర్చున్నపుడు కూడా మధ్య మధ్యలో పాదాలను కదిలిస్తూ ఉండాలి. కదలిక లేకుండా అలాగే ఉంచేయ కూడదు.
కురులకు మేలు
ఆహారపు అలవాట్లలో తేడా నీటి కాలుష్యం, వాతావరణ కాలుష్యం కారణంగా జుట్టు రాలిపోవడం సహజం. అలాగే రసాయనాలు కలిపిన షాంపులు వాడటం ద్వారా కేశాలకు ముప్పు తప్పదు. అయితే ఆలూ రసంతో కేశాలను సంరక్షించుకోవచ్చునని అంటున్నారు నిపుణులు.
– కేశాల సంరక్షణకు ఇది మెరుగ్గా పనిచేస్తుంది. ఇందులోని పోషకాలు జుట్టు పెరుగుదలకు తోడ్పడతాయి. ఆలూ రసాన్ని మాడుకు పట్టించి మసాజ్ చేయడం ద్వారా జుట్టు పెరుగుతుంది. జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.
– ఆలూ రసాన్ని, నిమ్మరసాన్ని చేర్చి మాడుకు రాస్తే జుట్టు వత్తుగా పెరుగు తుంది. మాడుపై తేమ నిలుస్తుంది. – నిమ్మరసం, ఆలూ రసాన్ని సమానంగా తీసుకుని మాడుకు రాస్తే జుట్టు రాలే సమస్యంటూ వుండదు.
– ఆలూ రసాన్ని 15 నిమిషాల పాటు మాడుకు పట్టించి మసాజ్ చేస్తే రక్తప్రసరణ మెరుగవుతుంది.
– ఆలును శుభ్రం చేసుకుని తురుముకోవాలి. తర్వాత ఆ తురుమును మిక్సీలో రుబ్బుకుని వడగట్టుకోవాలి. ఆ జ్యూస్‌కు మాడుకు పట్టిస్తే జుట్టుకు మంచిది.