ఈ ఎన్నికలు కొడంగల్ రూపురేఖలను మారుస్తాయి : రేవంత్ రెడ్డి

Lies are your weaponsనవతెలంగాణ-హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ నిజంగా కొడంగల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి ఉంటే తనపై పోటీ చేసి గెలవాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సవాల్ చేశారు. ఈ ఎన్నికలు కొడంగల్ రూపురేఖలను మారుస్తాయన్నారు. తన హయాంలోనే కొడంగల్‌కు ప్రత్యేక గుర్తింపు వచ్చిందన్నారు. కేసీఆర్ ఈ నియోజకవర్గాన్ని దత్తత తీసుకొని చేసిందేమీ లేదన్నారు. గుర్నాథ్ రెడ్డి మద్దతుతో గెలిచిన ఎమ్మెల్యే… కొడంగల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేదన్నారు. ఈ నియోజకవర్గానికి సాగునీరు తేలేదన్నారు. కాలేజీలు రాలేదన్నారు. సిరిసిల్ల, సిద్దిపేటలను అభివృద్ధి చేసినట్లు కొడంగల్‌ను ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో యువత, నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారన్నారు. తన ప్రాణ సమానమైన కాంగ్రెస్ కార్యకర్తల నేతృత్వంలో తాను నామినేషన్ వేస్తున్నానన్నారు. కాంగ్రెస్ తెలంగాణ శాఖకు సోనియా గాంధీ తనను అధ్యక్షుడిగా నియమించిందని, కొడంగల్ ప్రజలు దీనిని ఆలోచన చేయాలన్నారు.

Spread the love