నవతెలంగాణ-హైదరాబాద్ : లోక్‌సభ ఎన్నికలు తుది అంకానికి చేరడంతో ప్రధాన రాజకీయ పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఈ ఎన్నికలు కేవలం మన కోసం కాదని, మన భవిష్యత్ తరాల బాగోగులను నిర్ధేశిస్తాయని సమాజ్‌వాదీ పార్టీ చీఫ్, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ అన్నారు. యూపీలోని దియోరియాలో మంగళవారం రాహుల్ గాంధీతో కలిసి ప్రచార ర్యాలీలో అఖిలేష్ పాల్గొన్నారు. కాషాయ పార్టీ కుట్రల నుంచి మనం రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని ఆయన ఓటర్లకు పిలుపు ఇచ్చారు.