నవతెలంగాణ – కోట: రాజస్థాన్ కోటాలో విద్యార్థుల ఆత్మహత్యల నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. విద్యార్థుల గదుల్లో స్పింగ్ లోడెడ్ ఫ్యాన్లను అమర్చాలని అధికారులు హాస్టల్, పీజీల యాజమాన్యాలకు ఆదేశాలు జారీ చేశారు. ఈ ఏడాదిలో 21 మంది విద్యార్థులు వివిధ కారణాలతో ఆత్మహత్యలకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ స్పింగ్ లోడెడ్ ఫ్యాన్ల ద్వారా ఆత్మహత్య కు ప్రయత్నించినా.. వేలాడకుండా చేస్తాయని అధికారులు తెలిపారు.