టెంట్ క్రింద తెయూ కాంట్రాక్టు ప్రొపెసర్లు..

నవతెలంగాణ- డిచ్ పల్లి
తెలంగాణ ఉద్యమంలో మొదటి భాగాన నిలిచిన యూనివర్సిటీ కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లు తమను రెగ్యులరైజేషన్ చేయాలని ఉద్యమాన్ని ఉద్భతం చేశారు. రాష్ట్రంలోని 12 యూనివర్సిటీ లో పని చేస్తున్న కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లను రెగ్యులరైజేషన్ చేయాలని ఏకైక డిమాండ్ తో మంగళవారం యూనివర్సిటి ప్రధాన ద్వారం వద్ద టెంటు వేసి నిరసన కార్యక్రమాలను చేపట్టారు. తమను రెగ్యులర్ చేయాలని చేపట్టిన నిరసన కార్యక్రమాలు వంద రోజులు దాటిన ప్రభుత్వ పెద్దలు పట్టించుకోక పోవడంతో అందళన కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టినట్లు అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్. వి. దత్తాహరి తెలిపారు. బుధవారం వరకు టెంట్ క్రింద నిరసన కార్యక్రమాలు చేపట్టి అనంతరం నేరవదిక సమ్మెకు దిగుతున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని తెలంగాణ యూనివర్సిటీ లో ప్రారంభమైన కాంట్రాక్టు అద్యాపకుల నిరసనలు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టి యూనివర్సిటీ నుంచి స్తంభింపజేస్తామని దత్తాహరి తెలిపారు. ఈ నిరసన కార్యక్రమంలో తెయూ మాజి  రిజిస్ట్రార్ ప్రొఫెసర్ డాక్టర్ కనకయ్య మాట్లాడుతు కాంట్రాక్టు అధ్యాపకుల సమస్యను ‘పరిష్కరించి యూనివర్సిటీ అభివృద్దికి దోహదపదాలన్నారు. కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెన్లను రెగ్యులర్ చేస్తే యునివర్సిటలకు రావల్సన యుజిసి, రూసా తదితర నిధులు సమకూరి పరిశోధనల్లో అగ్ర భాగాన చేరి సమాజాభివృద్దికి తోడ్పడుతాయన్నారు. అనంతరం మాజీ ప్రిన్సిపాల్ డా. నాగరాజు మాట్లాడుతు కాంట్రాక్టు అధ్యాపకుల నిరసన కార్యక్రమాలతో విద్యావ్యవస్థ కుంటు పడుతుందని అందోళన వ్యక్తం చేశారు. తదనంతరం హిందీ విభాగానికి చెందిన ఆచార్యులు డా. జమిల్ మాట్లాడుతూ కాంట్రాక్టు అధ్యాపకుల న్యాయమైన ఈ రేగులరైజేషన్ డిమాండ్ ను ప్రభుత్వ పెద్దలు పరిష్కరించాలన్నారు. ఈ  కార్యక్రమానికి వివిధ విద్యార్థి సంఘాల నాయకులు శన, ప్రసాద్. గౌతమ్ కుమార్ లు తమ సంపూర్ణ మద్దతును ప్రకటించి గురుపూజోత్సవం రోజు ఆచర్యులు రోడ్డుపై చేరి నిరసన చేపట్టడం బాధాకరమన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వెంటనే స్పందించి రెగ్యులర్ చేయాలని తెలిపారు. కార్యక్రమంలో అసోషియేషన్ రాష్ట్ర ప్రతినిథులు డా. శరత్. డా. గంగా కిషన్, డా. నాగేశ్వర్ రావ్, డా, కిరణ్ రాథోడ్డ్, డా. దేవరాజు శ్రీనివాస్, డా. శ్రీనివాస్ , డా. జ్యోత్న, డా. రాజేశ్వరి, డా. నాగజ్యోతి, డా. శ్వేత, డా. పద్మ,  డా. నాగేంద్రబాబు, డా. పురుషోత్తం, డా. దానియేలు, డా. గోపిరాజు, డా. నేత, డా. మోహన్, డా. స్వామిరావ్, డా. రామేశ్వర్ రావ్, డా. నర్సయ్య,  ఆనంద్, నర్సింలు, డా. రామలింగం, నర్సయ్య, రమ్యశ్రీ తదితరులు పాల్గోన్నారు.
Spread the love