అవన్నీ పుకార్లే..

– సచిన్‌ పైలట్‌ కొత్త పార్టీపై కాంగ్రెస్‌
న్యూఢిల్లీ : రాజస్థాన్‌కు చెందిన కాంగ్రెస్‌ నాయకులు సచిన్‌ పైలట్‌ కొత్త పార్టీ ఏర్పాటు చేస్తారని వస్తున్న వార్తలన్నీ పుకార్లే అని పార్టీ ఖండించింది. ఇక్కడి ఎఐసిసి ప్రధాన కార్యాలయంలో పార్టీ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్‌ విలేకరులతో మాట్లాడుతూ తాను ఎప్పటికప్పుడు సచిన్‌ పైలట్‌తో సంప్రదింపులు జరుపుతున్నానని, ఈ ఏడాది చివరిలో జరిగే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఐక్యంగా పోరాడుతుందని తెలిపారు. పైలట్‌ కొత్త పార్టీ గురించి ప్రశ్నించగా ‘ ఇవన్నీ పుకార్లు. నాకు తెలిసి రాజస్థాన్‌లో అలాంటివి లేవు’ అని చెప్పారు. కాగా, తన తండ్రి రాజేష్‌ పైలెట్‌ వర్థంతి సందర్భంగా ఈ నెల 11న సచిన్‌ పైలట్‌ కొత్త పార్టీ ప్రకటన చేస్తారని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.

Spread the love