హీరో సంతోష్ శోభన్ నటిస్తున్న తాజా చిత్రం ‘ప్రేమ్ కుమార్’. రైటర్ అభిషేక్ మహర్షి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సారంగ ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై శివ ప్రసాద్ పన్నీరు నిర్మిస్తున్నారు. రాశీ సింగ్, రుచిత సాధినేని హీరోయిన్లు. ఈ సినిమా ఈనెల 18న రిలీజ్ అవుతోంది. ఈ నేపథ్యంలో శనివారం ఈ చిత్ర పరిచయ వేదిక కార్యక్రమం జరిగింది.
హీరో సంతోష్ శోభన్ మాట్లాడుతూ, ”అభిషేక్ మహర్షి, శివ ప్రసాద్లకు థ్యాంక్స్. వాళ్లు నమ్మితేనే సినిమా ఇంత వరకు వచ్చింది. ఈ సినిమా మిమ్మల్ని రెండు గంటల పాటు మనస్ఫూర్తిగా నవ్విస్తుందని నమ్ముతున్నాను. ఈనెల 18న థియేటర్స్‌లో కలుద్దాం’ అని అన్నారు. డైరెక్టర్ అభిషేక్ మహర్షి మాట్లాడుతూ ‘ఈ కథ ఫిక్స్ కావటానికి కారణం సంతోష్ శోభన్. అనంత్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. థియేటర్‌లో సౌండ్ కొత్తగా ఉంటుంది. ఆడియెన్స్ సర్‌ప్రైజ్ అవుతారు. ఈ సినిమా చూస్తున్నప్పుడు మన ఫ్రెండ్స్ గుర్తుకొస్తారు. బయట మనం ఎలా ఉంటామో అదే పాత్రలను తెరపై చూస్తారు’ అని అన్నారు. నిర్మాత శివ ప్రసాద్ మాట్లాడుతూ, ‘ఆడియెన్స్‌ను ఎంటర్‌టైన్ చేయాలనేదే లక్ష్యంగా చేసిన సినిమా. ఇకపై ప్రతీ పార్టీలో మా మూవీ సాంగ్ వినిపిస్తుంది’ అని తెలిపారు. ‘ఇందులో అంగన అనే పాత్రలో డబ్బున్న అమ్మాయి ఎలా ఉండకూడదో అలా ఉండే టైప్ చేశా’ అని నాయిక రుచితా సాధినేని చెప్పారు.