ఆలోచించి ఓటేయ్యండి

– అందుబాటులో ఉండడమే కాకుండా అభివృద్ధికి సికింద్రాబాద్‌ను చిరునామాగా మార్చాం
– ఓటర్లకు పద్మారావు గౌడ్‌ పిలుపు
నవతెలంగాణ-ఓయూ
సికింద్రాబాద్‌ నియోజకవర్గాన్ని అభివృద్ధికి చిరునామాగా మార్చి, ప్రజలకు సంక్షేమ ఫలాలను అందించడంతో పాటు వారి అవసరాలను నిరంతరం తీర్చుతున్నామని డిప్యూటీ స్పీకర్‌, సికింద్రాబాద్‌ బీఆర్‌ఎస్‌ అభ్యర్ధి తీగుల్ల పద్మారావు గౌడ్‌ అన్నారు. సికింద్రాబాద్‌ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా మంగళవారం వివిధ ప్రాంతాల్లో కార్పొరేటర్లు, నేతల ఆధ్వర్యంలో భారీ బైక్‌ ర్యాలీలు నిర్వహించారు. డిప్యూటీ మేయర్‌ మోతే శ్రీలత శోభన్‌ రెడ్డి, కార్పొరేటర్లు సామల హేమ, కంది శైలజ, రాసురి సునీత రమేష్‌, లింగాని ప్రసన్న లక్ష్మి, యువ నేతలు కిషోర్‌ కుమార్‌, కిరణ్‌ కుమార్‌, రామేశ్వర్‌ గౌడ్‌, త్రినేత్ర గౌడ్‌, సీనియర్‌ నేతలు మోతే శోభన్‌ రెడ్డి, కరాటే రాజు, కంది నారాయణలతో పాటు పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు ఈ ర్యాలీల్లో పాల్గొన్నారు. తొలుత సీతాఫలమండీ నుంచి బైక్‌ ర్యాలీని పద్మారావు గౌడ్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా పద్మారావు గౌడ్‌ మాట్లాడు తూఎన్నో పనులను కేవలం గడచిన పదేళ్ళ వ్యవధిలోనే చేపట్టా మని తెలిపారు. సీఎం కేసీఆర్‌, మున్సిపల్‌ మంత్రి, బీ ఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ప్రోత్సాహంతో అన్ని రంగాల్లో అభివద్ధిలో సికింద్రాబాద్‌ నియోజకవ ర్గాన్ని ప్రథమ స్థానంలో నిలుపుతున్నామని తెలిపారు. 50 సంవత్సరాలుగా కేవలం కాగితాలకే పరిమితమై, నాయకుల వాగ్దానలకే మితంగా నిలిచిన తుకారాం గేటు ఆర్‌యుబి, నిర్మాణం పనులు దాదాపు రూ.72 కోట్ల నిధులను వినియోగించి నిర్మించి ప్రజలకు అందుబాటులోకి తెచ్చామని తెలిపారు. సీఎం కెసిఆర్‌ నుంచి రూ.30 కోట్ల ప్రత్యేక నిధులతో సీతాఫల మండీలో ప్రభుత్వ ప్రైమరీ, హై స్కూల్‌, జూనియర్‌, డిగ్రీ కాలేజీ కొత్త భవనాలను నిర్మించే పనులు చురుకు గా సాగుతున్నాయని, సికింద్రాబాద్‌లో జూనియర్‌, డిగ్రీ కాలేజీలు లేని లోటును తీర్చి, 50 ఏళ్ళ స్థానికుల కలను నేరవేర్చడంతో పాటు కొత్త భవనాల నిర్మాణం పనులు కూడా చేపట్టడం విశేషమని తెలిపారు. పేద, మధ్య తరగతుల వారికి సీతాఫలమండీ మల్టీ పర్పస్‌ ఫంక్షన్‌ హాల్‌ ఉపయోగపడుతోందని, లాలాపేట, అడ్డగుట్టలో మరో రెండు ఫంక్షన్‌ హాల్స్‌ నిర్మిస్తున్నామని తెలిపారు. లాలపేట్‌ వద్ద రూ.4 కోట్లతో కొత్త కల్వర్టు, ఫ్రైడే మార్కెట్‌, మహమ్మద్‌ గుడా, ఎల్‌ నారాయణ నగర్‌ ప్రాంతాల్లో రూ.2.5 కోట్ల ఖర్చుతో కల్వర్టులు నిర్మించామని, తద్వారా భారీ వర్షాలు కురిసిన సందర్భా ల్లో కూడా ఏ ఇబ్బందులు ఎదురుకాకుండా ఏర్పాట్లు జరిపామని తెలిపారు. ఆలుడ్డబావి వద్ద ఎఫ్‌ఓబీ ఏర్పాటు ప్రతిపాదించామని పద్మారావు గౌడ్‌ వివరిం చారు. పార్కుల అభివద్ధి, క్రీడా పరికరాల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నామని, ఐదు రూపాయల అన్నపూర్ణ భోజనం కేంద్రాలు చిలకలగూడ, బౌధనగర్‌, మనికేశ్వరి నగర్‌, అడ్డగుట్ట్లలో ప్రారంభించామని, సికింద్రాబాద్‌ కు నేరుగా కష్ణా జలాల తరలింపు ప్రాజెక్ట్‌, ఇన్‌ లేట్‌ /ఔట్‌ లెట్‌ లతో కలిపి రూ. 6 కోట్లతో శాంతి తార్నాక రిజర్వాయర్‌ (9.27 కోట్లు), మారేడ్‌ పల్లి రిజర్వాయర్‌ (12 కోట్లు (ప్రాజెక్ట్‌లు పూర్తయి అందుబాటులోకి వచ్చాయి) దశాబ్దాలుగా మంచి నీటి ఎద్దడి, సివరేజ్‌ సమస్యలను ఎదుర్కొన్న సికింద్రాబాద్‌ ప్రజలకు ఆయా సమస్యల నుంచి శాశ్వత విముక్తిని కల్పించామని తెలిపారు. రికార్డు సంఖ్యలో 190 పవర్‌ బోరింగ్‌లు ఏర్పాటు చేశామని, ప్రస్తుతం 21 వేల మందికి ఆసరా పెన్షన్లు అందిస్తున్నామని, కళ్యాణ లక్ష్మి, షాదీముబారక్‌, సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను నేరుగా లబ్దిదారుల ఇళ్ళ వద్దే అందిస్తున్నామని తెలిపారు. రైల్వే ఆసుపత్రిలో కరోనా వైద్య సేవలు, వ్యాక్సిన కేంద్రం ఏర్పాటుకు అప్పటి వైద్య శాఖా మంత్రిని, అధికారులను సంప్రదించి లాలాగూడ రైల్వే ఆసుపత్రిలో సైతం ఈ సదుపాయాలు కల్పిం చామని, ప్రయోజనం పొందారని తెలిపారు. తమకు మద్దతు తెలిపి ఇప్పటికే ప్రారంభించిన అభివద్ధి పను లు కొనసాగేందుకు సహకరించాలని కోరారు. బీఆర్‌ ఎస్‌ అధినేత కెసిఆర్‌ ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టో ప్రజలకు ఉపకరించనుందని, ప్రధానంగా ఆసరా పింఛన్ల మొత్తాల పెంపు, వంట గ్యాస్‌ సిలిండర్‌ ధరల తగ్గింపు, మహిళకు ఆర్ధిక సదుపాయం వంటి అంశాల వల్ల అందరికీ మేలు కలుగుతుందని పేర్కొన్నారు.

Spread the love