పేటీఎంకు థర్డ్‌ పార్టీ ప్రొవైడర్‌ హోదా..!

ముంబయి : పేటీఎంకు థర్డ్‌పార్టీ అప్లికేషన్‌ ప్రొవైడర్‌ హోదాను ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని ఎన్‌పిసిఐకి ఆర్బీఐ సూచించింది. పేటియం యాప్‌లో యూపీఐ లావాదేవీలు నిర్వహించుకునేందుకు వీలు కల్పించాలని కోరింది. ఈ అంశమై పేటీఎం మాతృసంస్థ వన్‌ 97 కమ్యూనికేషన్‌ అభ్యర్థన మేరకు ఆర్బీఐ సూచన చేసింది. ఒక వేళ ఆ హోదా లభిస్తే పేటీఎం భవిష్యత్తుల్లో యూపీఐ లావాదేవీలను ప్రాసెస్‌ చేయడానికి వీలుంటుంది.

Spread the love