సివిల్స్ ఫ‌లితాలు..తెలంగాణ అమ్మాయికి మూడో ర్యాంకు

నవతెలంగాణ-హైద‌రాబాద్ : యూపీఎస్సీ నిర్వ‌హించిన సివిల్స్ 2022 తుది ప‌రీక్ష‌ల ఫలితాలు విడుద‌ల‌య్యాయి. దేశ వ్యాప్తంగా 933 మందిని ఎంపిక చేశారు. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌కు చెందిన ఇషితా కిశోర్ తొలి ర్యాంకు సాధించ‌గా, తెలంగాణ‌కు చెందిన ఉమా హార‌తి ఎన్ మూడో ర్యాంకు సాధించారు. సివిల్స్ తుది ఫ‌లితాల్లో తెలంగాణ‌, ఏపీ రాష్ట్రాల‌కు చెందిన ప‌లువురు అభ్య‌ర్థులు ఎంపిక‌య్యారు. బీవీఎస్ ప‌వ‌న్ ద‌త్తా 22వ ర్యాంకు, హెచ్ఎస్ భావ‌న‌కు 55, సాయి ప్ర‌ణ‌వ్‌కు 60, నిధి పాయ్ 110, అంకుర్ కుమార్ 257, చ‌ల్లా క‌ళ్యాణి 285, వై శృతి 362, శ్రీకృష్ణ 293, హ‌ర్షిత 315, లక్ష్మి సుజిత 311, సోనియా క‌టారియా 376, రేవ‌య్య 410, సీహెచ్ శ్ర‌వ‌ణ్ కుమార్ రెడ్డి 426, రెడ్డి భార్గ‌వ్ 772, నాగుల కృపాక‌ర్ 866వ ర్యాంకు సాధించారు.

Spread the love