ఎన్ ఎంఎంఎస్ స్కాలర్షిప్ కు ఎంపికయిన తిర్మన్ పల్లి విద్యార్థిని…

నవతెలంగాణ – డిచ్ పల్లి
డిసెంబర్ 2022 లో జరిగిన కేంద్ర ప్రభుత్వం అధ్వర్యంలో నెషనల్ మిన్స్ కామ్ మేరిట్ స్కాలర్ షిప్ ఎన్ఎంఎంఎస్ జరిగిన ప్రతిభ పరీక్షలో ఇందల్ వాయి మండల కేంద్రంలోని తిర్మన్ పల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కు చెందిన 8 వ తరగతి విద్యార్థి కుమారి శెట్టి స్పందన తండ్రి పేరు ప్రసాద్ స్కాలర్ షిప్ నాకు ఎంపికయినట్లు ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాస్ రావు తెలిపారు. శుక్రవారం పాఠశాలలో జరిగిన అభినందన కార్యక్రమంలో ఎంపిటిసి చింతల దాస్, గ్రామ అభివృద్ధి కమిటీ చైర్మన్ ధర్పల్లి ప్రభాకర్,ఎస్ఎంసి చైర్మెన్ ఇమ్మడి సాయిలు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థి కష్ట పడి చదివితే మంచి భవిష్యత్తు ఉంటుందని, 9 వ తరగతి నుండి ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం వరకు ప్రతి ఏటా 12 000 వేల రూపాయలు స్కాలర్ షిప్ లాభిస్తుందని వారన్నారు.మంచిగా చదువుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించే విధంగా చూడాలని సూచించారు.కుమారి శేట్టి స్పందనను వారు అభినందిస్తూ సన్మానించారు.

Spread the love