సంక్షోభ పరిష్కారానికి ఇదే చివరి యత్నం !

సంక్షోభ పరిష్కారానికి ఇదే చివరి యత్నం !– ముఖ్యమంత్రిగా రాలేదు, మీ సోదరిగా వచ్చా
– జూనియర్‌ డాక్టర్ల నిరసన శిబిరానికి మమతా బెనర్జీ
కోల్‌కతా:”మీ సోదరిగా భావించి మిమ్మల్ని కలుసుకుం దామని ఇక్కడకొచ్చా, సీఎంగా కాదు..సంక్షోభాన్ని పరిష్కరించ డానికి ఇది నా చివరి ప్రయత్నం ” అని సీఎం మమతా బెనర్జీ ఆందోళన చేస్తున్న డాక్టర్లను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలనుకోవడం లేదని, వారంతా తన సోదరులు, సోదరీ మణుల వంటివారని ఆయన వ్యాఖ్యానించారు. ”మీ ఉద్యమానికి మద్దతి స్తున్నా. మాకు అందచేసిన డిమాండ్లను పరిశీలిస్తా. దోషిగా ఎవరైనా తేలితే వారిపై తగు రీతిలో చర్యలు తీసుకుంటాం. న్యాయం జరగాలనే నేను కోరు కుంటు న్నా. సాధ్యమైనంత త్వరలో న్యాయం జరిగేలా చూడాలని సిబిఐకి విజ్ఞప్తి చేస్తున్నా.” అని ఆమె పేర్కొన్నారు. ఆర్‌జి కర్‌ ఆస్పత్రిలో జూనియర్‌ వైద్యు రాలిపై లైంగికదాడి, హత్య నేపథ్యంలో నెల రోజులుగా ఆందోళన జరుపు తున్న వైద్యులను కలుసుకోవడానికి ఆమె సాల్ట్‌ లేక్‌ వద్ద గల నిరసన శిబిరానికి వచ్చారు. ఈ సందర్భంగా తమ డిమాండ్లు వినాలని కోరుతూ బెంగాల్‌ జూనియర్‌ డాక్టర్స్‌ ఫ్రంట్‌ లేఖ రాసింది. దానిపై ప్రభుత్వ చీఫ్‌ సెక్రటరీ మనోజ్‌ పంత్‌ చర్చలకు రావాల్సిందిగా డాక్టర్లను ఆహ్వానించారు.

Spread the love