ఇది బీజేపీ తరహా లీకేజ్‌ : కాషాయ పార్టీపై అఖిలేష్‌ యాదవ్‌ ఫైర్‌

నవతెలంగాణ-హైదరాబాద్ : పేపర్ల లీకేజీ వ్యవహారం కొత్త విషయం కాదని, యూపీలో ఇది పెద్ద అంశం కాగా, ఇప్పుడు ఢిల్లీకి కూడా పాకిందని ఎస్పీ చీఫ్‌, ఆ పార్టీ ఎంపీ అఖిలేష్‌ యాదవ్‌ అన్నారు. కాషాయ పార్టీ తన సొంత మనుషుల మెప్పు పొందేందుకు ప్రశ్నాపత్రాలను లీక్‌ చేయడం చూశామని చెప్పారు.  అఖిలేష్‌ సోమవారం పార్లమెంట్ ఆవరణలో మీడియాతో మాట్లాడుతూ ఇది బీజేపీ తరహా లీకేజ్‌ అని ఎద్దేవా చేశారు. నీట్‌-యూజీ పరీక్ష రద్దు, ప్రశ్నాపత్రాల లీకేజ్‌, పరీక్షల నిర్వహణలో లోటుపాట్లపై యువత తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోందని చెప్పారు. లక్షలాది విద్యార్ధుల భవిష్యత్‌ ప్రభుత్వ నిర్వాకంతో అంధకారంలో పడిందని దుయ్యబట్టారు. కాషాయ పాలకులు అసమర్ధ విధానాలతో కోట్లాది ప్రజలను మోసం చేశారని అఖిలేష్‌ యాదవ్‌ మండిపడ్డారు.

Spread the love