ఇదే నా చివరి టీ20 వరల్డ్ కప్: బౌల్ట్

నవతెలంగాణ – హైదరాబాద్ : ప్రస్తుతం జరుగుతున్న టీ20 వరల్డ్ కప్పే తనకు చివరిదని న్యూజిలాండ్ స్టార్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ అన్నారు. అయితే ఆ తర్వాత రిటైర్మెంట్ ప్రకటిస్తారా? లేక ఇతర ఫార్మాట్లలో కొనసాగుతారా? అనేదానిపై అతడు క్లారిటీ ఇవ్వలేదు. 34 ఏళ్ల వయసులోనూ అద్భుతంగా రాణిస్తున్న బౌల్ట్ ఈ WCలో 3 మ్యాచ్‌ల్లో 7 వికెట్లు తీశారు. కానీ కివీస్ లీగ్ దశలోనే ఎలిమినేట్ అయింది.

Spread the love