ఇంజినీరింగ్ ప్రవేశాల కౌన్సెలింగ్ షెడ్యూలు ఇదే

నవతెలంగాణ- హైదరాబాద్‌: తెలంగాణలో ఇంజినీరింగ్‌ ప్రవేశాల కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ను ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. మొత్తం మూడు విడతల్లో ప్రవేశాల ప్రక్రియ జరగనుంది. జూన్‌ 27 నుంచి ప్రవేశాల ప్రక్రియ ప్రారంభం కానుంది. జూన్‌ 30 నుంచి మొదటి విడత వెబ్‌ ఆప్షన్లకు అవకాశం ఇచ్చారు. జులై 12న మొదటి విడత సీట్ల కేటాయింపు జరగనుంది. జులై 19 నుంచి రెండో విడత కౌన్సెలింగ్.. జులై 24న సీట్ల కేటాయింపు చేపట్టనున్నారు. జులై 30 నుంచి తుది విడత కౌన్సెలింగ్.. ఆగస్టు 5న సీట్లను కేటాయించనున్నారు.

Spread the love