పసర పంచాయతీ ఎనిమిదవ వార్డు పరిస్థితి ఇది..

నవతెలంగాణ-గోవిందరావుపేట
మండలంలోని పసర గ్రామపంచాయతీ 8వ వార్డు పరిస్థితి అత్యంత దారుణంగా ఉందని వార్డు ప్రజలు బుర్ర శ్రీను కడారి నాగరాజులు తెలిపారు. బుధవారం నవ తెలంగాణతో శ్రీను నాగరాజు పసర మేడారం ఆర్ అండ్ బి రహదారి వెంట జిల్లా పరిషత్ హై స్కూల్ పక్కన ఉన్న ఈ వీధి ఏమాత్రం వర్షం పడ్డ మనుషులు నటించేందుకు కూడా వీలు కాదని తెలుపుతున్నారు. పాఠశాల పక్కనే ఉండడం వల్ల అత్యధికంగా ఈ వీధి నుండి విద్యార్థులు బురదలోనే ప్రయాణిస్తుంటారని తెలుపుతున్నారు. అనేక వాహనాలు ఈ మార్గం గుండా పయనిస్తూ మరింత బురదమయం చేస్తున్నారని అంటున్నారు. మారుమూల వీధులను సిసి రహదారులుగా మారుస్తున్న తరుణంలో పాఠశాల పక్కనే ఉన్న ఈ రహదారిని పంచాయతీ అధికారులు సీసీగా మార్చకపోవడంలో అంతర్యం ఏంటో అర్థం కావడం లేదని అన్నారు. ప్రజా ప్రతినిధులు అధికారులు ఎవరికి వారు ఏమి పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారని అంటున్నారు. ఇప్పటికైనా సమస్యను పరిష్కరించేందుకు కృషి చేయాలని వార్డు ప్రజలు కోరారు.

Spread the love