రేషన్‌కార్డుల ఈ-కేవైసీ గడువు పొడిగింపు

Ration Card E-KYCనవతెలంగాణ – హైదరాబాద్
రేషన్‌కార్డుల ఈ-కేవైసీ గడువును కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. ఈ నెలాఖరుతో గడువు ముగియనుండగా దానిని ఫిబ్రవరి నెలాఖరు వరకు పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది. బోగస్ కార్డుల ఏరివేతలో భాగంగా ప్రభుత్వం ఈ-కేవైసీని తీసుకొచ్చి జనవరి 31లోగా లబ్ధిదారులు తమ వేలిముద్రలతో రేషన్‌కార్డును ధ్రువీకరించుకోవాలని కోరింది. గడవు సమీపిస్తున్నప్పటికీ చాలా రాష్ట్రాల్లో ఇంకా ఈ ప్రక్రియ పూర్తికాలేదు. తెలంగాణలో ఇప్పటి వరకు 75.76 శాతం మంది మాత్రమే ఈ-కేవైసీ ప్రక్రియను పూర్తిచేసుకున్నారు. ఈ నేపథ్యంలో గడువును ఫిబ్రవరి నెలాఖరుకు పెంచారు. ఆలోగా వందశాతం ఈ-కేవైసీని పూర్తిచేయాలని పౌరసరఫరాలశాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్ అన్ని జిల్లాల అదనపు కలెక్టర్లు, హైదరాబాద్ చీఫ్ రేషనింగ్ ఆఫీసర్‌ను ఆదేశించారు.

Spread the love