నవతెలంగాణ -సుల్తాన్ బజార్ : గణేష్ ఉత్సవం, మిలాద్-ఉన్-నబీ పండుగల నేపథ్యంలో మంగళవారం ఈస్ట్ జోన్ డిసిపి ఆధ్వర్యంలోఆర్ ఏ ఎఫ్ బలగాలతో కలిసి ఈ ఫ్లాంగ్ మార్చ్ ను అఫ్జల్ గంజ్ పోలీస్ స్టేషన్ నుండి గౌలిగూడ చమన్ ,గురుద్వార్, పుత్లిబౌలి , 94 గల్లి, సుల్తాన్ బజార్ మెట్రో స్టేషన్ ఆంధ్ర బ్యాంకు వరకు ఫ్లాగ్ మార్చి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈస్ట్ జోన్ డిసిపి సునీల్ దత్ ఐపీఎస్, అడిషనల్ డీసీపీ పృథ్వీధరావు, సుల్తాన్ బజార్ ఏసిపి బాల గంగిరెడ్డి, కాచిగూడ ఏసిపి శ్రీనివాస్ , ఓయూ ఏసిపి సైదయ్య చిక్కడపల్లి ఏసిపి జైపాల్ రెడ్డి , సుల్తాన్ బజార్ ఇన్ స్పెక్టర్ కే ముత్తు, అఫ్జల్ గంజ్ ఇన్ స్పెక్టర్ నారాయణగూడ ఇన్ స్పెక్టర్, ఎస్ఐ లు,150 ఆర్ ఎఫ్ బలగాలతో ఈ ఫ్లాగ్ మార్చి నిర్వహించారు.