– వర్షాలు మొదలవ్వగానే మొక్కలు పంపిణీ..
– ఆయిల్ఫెడ్ జనరల్ మేనేజర్ సుధాకర్ రెడ్డి.
నవతెలంగాణ – అశ్వారావుపేట
ఈ ఆయిల్ ఇయర్ నిర్దేశించుకున్న లక్ష్యాలను సకాలంలో చేరుకోవాలని ఆయిల్ఫెడ్ జనరల్ మేనేజర్ సుధాకర్ రెడ్డి సంస్థ సిబ్బందికి సూచించారు. ఆయన మంగళవారం సాదారణ సందర్శనలో భాగంగా సంస్థ అభివృద్ది పనులు పురోగతిని పరిశీలించారు. అశ్వారావుపేట, అప్పారావుపేటలో గల పరిశ్రమలను,నారంవారిగూడెం లో గల కేంద్రీయ నర్సరీ ని,బి బ్లాక్ లో నిర్మిస్తున్న అతిధి గృహం పనులను తనిఖీ చేసారు. అనంతరం సిబ్బందితో పనులు పురోగతి పై సమీక్ష నిర్వహించారు. వానలు కురవడం ప్రారంభం కాగానే ప్రాధాన్యతా క్రమంలో సాగుదారుల కు మొక్కలు పంపిణీ చేయాలని సూచించారు.
ఆయన వెంట మేనేజర్లు ఆకుల బాలక్రిష్ణ, కల్యాణ్ గౌడ్, ఎం.నాగబాబు, వెంకటేష్, ఫైనాన్స్ ఎక్జిక్యూటివ్ రాధాక్రిష్ణ లు ఉన్నారు.