ఈనెల 5 నుండి 9 వరకు చత్రపతి శివాజీ మహారాజ్ స్టేడియం జల్గావ్, మహారాష్ట్రలో జరిగిన 68వ స్కూల్ గేమ్స్ జాతీయ సాఫ్ట్ బాల్ అండర్-17 పోటీలలో మన జడ్పీహెచ్ఎస్ తొర్లికొండ పాఠశాల విద్యార్థిని సాంబార్ నిత్యశ్రీ రాష్ట్ర జట్టు తరఫున పాల్గొని జట్టు విజయంలో కీలక పాత్ర పోషించి కాంస్య పతాకాన్ని అందుకున్నట్లు పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ మర్కంటి గంగా మోహన్ తెలిపారు. ఈ సందర్భంగా జాతీయ పోటీలలో రాణించి కాంస్య పథకం అందుకున్న విద్యార్థిని నిత్యశ్రీని మరియు రాష్ట్ర జట్టుకు కోచ్ గా వ్యవహరించిన పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ మర్కంటి గంగా మోహన్ లను పాఠశాల ప్రధానోపాధ్యాయులు , మండల విద్యాధికారి మరియు తొర్లికొండ గ్రామ స్పెషల్ ఆఫీసర్ ఎం శ్రీనివాస్ , ఉపాధ్యాయ బృందం సాయిలు, రామకృష్ణ, గంగాధర్, డాక్టర్ నరసింహారావు, సునీత, కృష్ణ, మాలతి, పల్లె గంగాధర్, గౌతమి , ఓఎస్ శేఖర్ లు అభినందించారు.