ఆ పిల్ల కనులే..

ఆ పిల్ల కనులే..అల్లు శిరీష్‌ హీరోగా నటిస్తున్న లేటెస్ట్‌ మూవీ ‘బడ్డీ’. గాయత్రి భరద్వాజ్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్‌ ఫిలింస్‌ బ్యానర్‌ పై కేఈ జ్ఞానవేల్‌ రాజా, అధన జ్ఞానవేల్‌ రాజా నిర్మిస్తున్నారు. శామ్‌ ఆంటోన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. నేహ జ్ఞానవేల్‌ రాజా కో ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. యూత్‌ఫుల్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి మంగళవారం ఫస్ట్‌ సింగిల్‌ రిలీజ్‌ అనౌన్స్‌ మెంట్‌ చేశారు. నేడు (బుధవారం) ఉదయం 10 గంటలకు ఈ మూవీ ఫస్ట్‌ సింగిల్‌ ‘ఆ పిల్ల కనులే..’ను రిలీజ్‌ చేయబోతున్నట్లు తెలిపారు. హిప్‌ హాప్‌ తమీజా ఈ సినిమాకు సంగీతాన్ని అందించారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా గ్రాండ్‌ థియేట్రికల్‌ రిలీజ్‌కు రాబోతోంది. రిలీజ్‌ డేట్‌ను త్వరలోనే మేకర్స్‌ అనౌన్స్‌ చేయబోతున్నారు.

Spread the love