సదరం క్యాంపుకు హాజరయ్యేవారు 8న స్లాట్ బుకింగ్ చేసుకోవాలి

–  వికలాంగుల కోఆర్డినేటర్

నవతెలంగాణ- జక్రాన్ పల్లి
సదరం క్యాంపుకు హాజరయ్యే వారు ఈనెల 8న మీ సేవలో స్లాట్ బుకింగ్ చేసుకోవాలని ఐకెపి వికలాంగుల సిసి శ్రీరామ్ తెలిపారు. ఈనెల 13,20, 27 తేదీలలో నిజాంబాద్ పట్టణం నందు ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి లో సదరం క్యాంపులు నిర్వహించడం జరుగుతుందన్నారు. సదరం క్యాంపుకు హాజరవుటకు స్లాట్ బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుందన్నారు. ఈ నెలలో మూడు సదరం క్యాంపులు నిర్వహించడంలో ఐదు రకాల వికలాంగత్వం 390 స్లాట్ బుకింగ్ చేసుకునే అవకాశం ఉందని తెలిపారు. సదరం క్యాంపుకు హాజరయ్యేవారు మెడికల్ రిపోర్టు, ఎక్సరీలు తీసుకొని హాజరు కావాలన్నారు. ఒక వ్యక్తితో ఒకరు హాజరుకావాలని సూచించారు. సదరం సర్టిఫికెట్ రెన్యువల్ చేసుకునేవారు పాత సదరం సర్టిఫికెట్తో హాజరు కావాలని అన్నారు. సదరం సర్టిఫికెట్ గడువు ముగిసిన వారు వెంటనే సదరం సర్టిఫికేట్ రెన్యువల్ చేసుకోవాలి, రెన్యువల్ చేసుకోకపోతే వికలాంగుల పెన్షన్ నిలిపివేయడం జరుగుతుందని పేర్కొన్నారు.
Spread the love