తెలంగాణలో రేపట్నుంచి ఆ బస్సులు బంద్

bనవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణ ప్రజలకు బిగ్ షాక్…రేపట్నుంచి బస్సులు బంద్ కానున్నాయి. టీఎస్ఆర్టీసీ అద్దె బస్సుల యజమానులు రేపటి నుంచి సమ్మెకు దిగుతున్నట్లు ప్రకటించారు. మహాలక్ష్మి పథకంతో ప్రయాణికుల సంఖ్య పెరిగిందని…. రద్దీ పెరిగితే బస్సులు పాడవుతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  రద్దీ వల్ల ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. దీంతో టీఎస్ఆర్టీసీ యాజమాన్యం వారిని ఇవాళ చర్చలకు ఆహ్వానించింది. చర్చలు సానుకూలంగా లేకపోతే సమ్మె యధావిధిగా చేస్తామని యజమానులు హెచ్చరించారు. మరి టీఎస్ఆర్టీసీ అద్దె బస్సుల యజమానులు సమ్మెపై ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించలేదు. మరి టీఎస్ఆర్టీసీ అద్దె బస్సుల యజమానులు సమ్మెపై కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.

Spread the love