ఆ ఉద్యోగులను సొంత రాష్ట్రాలకు బదిలీ చేయాలి

నవతెలంగాణ-హైదరాబాద్‌3
తెలంగాణ, ఏపీలో స్థానికేతరులుగా ఉన్న ఉద్యోగులను వారి సొంత రాష్ట్రాలకు మానవతా దృక్పధంతో బదిలీ చేయాలంటూ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కూనంనేని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కోరుతూ సోమవారం హైదరాబాద్‌లోని మఖ్దూంభవన్‌లో కూనంనేనిని తెలంగాణ నాన్‌ లోకల్‌ టీచర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు ఎం మోహన్‌రావు, ప్రధాన కార్యదర్శి వి సూర్యనారాయణ, తెలంగాణ నేటివ్‌ ఎంప్లాయిస్‌ వర్కింగ్‌ ఇన్‌ సీమాంధ్ర అసోసియేషన్‌ అధ్యక్షులు బి లక్ష్మి నారాయణ, ప్రధాన కార్యదర్శి వి అంజయ్య, నేతలు వి మురళికృష్ణ, శ్రీను, మల్లన్న, ప్రభాకర్‌, రామారావు, ప్రభాకర్‌ తదితరులు ఆయన్ను కలిసి వినతి పత్రం సమర్పించారు. తెలంగాణ నుంచి బదిలీ కోసం ధరఖాస్తు చేసుకున్న సుమారు 1,380 మంది ఉద్యోగులను తీసుకుంటామని ఏపీ సీఎం జగన్‌ హామీ ఇచ్చారని వారు తెలిపారు.
ఏపీ నుంచి తెలంగాణకు వచ్చేందుకు సుమారు 1,808 మంది దరఖాస్తులు ఏడాది కాలంగా ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొన్నారు. ఈ సమస్య పరిష్కారానికి సీఎం కేసీఆర్‌కు లేఖ రాస్తానని కూనంనేని వారికి హామీ ఇచ్చారు.

Spread the love