ఆ వార్తలు అవాస్తవాలు ..

నవతెలంగాణ – హైదరాబాద్: టాటా సన్స్‌ మాజీ చైర్మన్‌ రతన్‌ టాటా తీవ్ర అస్వస్థతకు గురైనట్లు వార్తలు వస్తున్నాయి. రక్తపోటు తగ్గిపోవడంతో వెంటనే ఆయనను ముంబైలోని బ్రీచ్‌కాండీ ఆస్పత్రికి తరలించారని, ఐసీయూలో చికిత్స పొందుతున్నట్లు జాతీయ మీడియా పేర్కొంది. దీంతో పలువురు ప్రముఖులు, అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో అస్వస్థత వార్తలపై రతన్‌ టాటా స్పందించారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. తాను క్షేమంగానే ఉన్నానని తెలిపారు. ఐసీయూలో చేరిన వార్తలను రతన్‌ టాటా ఖండించారు. ఈ మేరకు ఎక్స్‌ వేదికగా వివరణ ఇచ్చారు. ‘నా ఆరోగ్యంపై వచ్చిన వార్తలు నిరాధారమైనవి. నా వయసు రీత్యా వచ్చిన ఆరోగ్య పరిస్థితుల కారణంగా నేను ప్రస్తుతం వైద్య పరీక్షలు చేయించుకుంటున్నాను. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. నేను క్షేమంగానే ఉన్నాను. నా ఆరోగ్యంపై ఆందోళన చెందిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు’ అని రతన్‌ టాటా పేర్కొన్నారు.

Spread the love