నా భర్త మృతికి కారణమైన వారిని శిక్షించాలి

నవతెలంగాణ-అన్నపురెడ్డిపల్లి
మండల పరిధిలోని అబ్బుగూడెం గ్రామంలో ఓ గిరిజనుడు హఠాత్‌ మరణంతో గ్రామం మొత్తం హాడల్‌ అయి పోయింది. అబ్బుగూడెం గ్రామానికి చెందిన బూరుగు శ్రీనివాసరావు (35) అలియాస్‌ లక్ష్మయ్య అదే గ్రామానికి చెందిన ఓ రైతు వరి పొలంలో విఘతి జీవిగా పడి పోయి ఉండటంతో గమనించిన కొందరు కూలీలు వెళ్లి చూడగా అప్పటికే మరణించడం ఉండటంతో కుటుంబ సభ్యులకు మరణ వార్త తెలియజేశారు. మృతుడు భార్య బూరుగు స్వప్న తెలిపిన వివరాల ప్రకారం… భర్త శ్రీనివాసరావు, సోదరుడు భీమినేని పోతురాజును గత 4 రోజులు క్రితం అదే గ్రామానికి చెందిన ఓ బీఆర్‌ఎస్‌ నాయుకుడు ఎదో పంచాయతీ ఉంది రమ్మని పిలిపించుకొని భర్తను, సోదరుడిని కొట్టి బూతులు తిట్టి అవమానించారని, అంతేగాక భర్త శ్రీనివాసరావు పై కేసు పెట్టి రాజకీయ పలుకుబడితో పోలీస్‌ స్టేషన్‌ చుట్టూ తిప్పిస్తు మానసికంగా బాధపెడుతున్నారు. నా భర్త అనేక సార్లు చెప్పి మానసికంగా బాధపడినాడు. అని ఇదే క్రమంలో సోమవారం అదే గ్రామానికి చెందిన ఓ రైతు పొలంలో పురుగు మందు స్ప్రే చేయలని తీసుకుపోయారు. మధ్యాహ్నం సుమారు 12 గంటల సమయంలో వరి పొలంలో మరణించడం అతన్ని చూసిన కొందరు గ్రామ స్తులు మృతదేహంతో ఇంటికి రావడం చాలా బాధాకరంగా ఉందని అవమానాలు బరించలేక రాజకీయ వేధింపులు వలన శ్రీనివాసరావు అలియాస్‌ లక్ష్మయ్య చనిపోయాడని తెలియజేసింది. భర్త మరణానికి కారణమైన ముగ్గురు వ్యక్తులు పై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేసింది. రాజకీయ ఒత్తిడి వలన శ్రీనివాసరావు చనిపోయాడని మృతుడు బంధువులు బీఆఎస్‌ నాయుకుడు ఇంట్లో సోమవారం రాత్రి సమయంలో సుమారు రెండు గంటలు పాటు మృతదేహాన్ని పడుకోబెట్టి న్యాయం చేయలని డిమాండ్‌ చేశారు. దీనితో కొత్తగూడెం వన్‌ టౌన్‌, టు టౌన్‌ సర్కిల్‌ ఇన్స్పెక్టర్‌లు కరుణాకర్‌, రమేష్‌, చండ్రుగొండ ఎస్సై రవి సంఘటన స్థలానికి చేరుకుని మృతుడు కుటుంబ సభ్యులకు, బంధువులుకు ఫిర్యాదు చేయండి విచారణ చేసి చట్టం ప్రకారం తగిన న్యాయం చేస్తామని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించాలని వారికి వివరించి మృతదేహాన్ని కొత్తగూడెం ప్రభుత్వ హాస్పటల్‌కి తరలించారు. భార్య స్వప్న ఫిర్యాదు మేరకు ఏఎస్సై అంజయ్య ముగ్గురు వ్యక్తులు పై కేసు నమోదు చేశామని తెలియజేశారు.

Spread the love