– దేవుని బిడ్డలుగా ఆదరించాలి
– నిజామాబాద్ జిల్లా పరిషత్ ఛైర్మన్ దాదన్న గారి విట్టల్ రావు
నవతెలంగాణ – కంటేశ్వర్
పోట్టకూటి కోసం (జోగిని) సెక్స్ వర్కర్ వృత్తిని ఎంచుకున్న వారిని చిన్న చూపు చూడకూడదని, దేవుడి బిడ్డలుగా ఆదరించాలని జిల్లా పరిషత్ ఛైర్మన్ దాదన్న గారి విఠల్రావు అన్నారు. ఆర్థిక స్థితిగతులు, ఇతర పరిస్థితిల కారణాలవల్ల ఈ వృత్తిని ఎంచుకోవడం జరుగుతుందని చెప్పారు. దేవుడి బిడ్డలకు తనవంతు సహాయ సహకారాలు అందిస్తానని వారు భరోసా ఇచ్చారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని మారుతి నగర్ లో గల స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీ కన్స్ట్రక్షన్ దివ్యాంగుల పాఠశాలలో మహిళ అంతర్జాతీయ సెక్స్ వర్కర్ ల హక్కుల దినోత్సవ వేడుకలు శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా పరిషత్ ఛైర్మన్ దాదాన్న గారి విఠల్రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జోగిని వ్యవస్థ అనేది ఉండేదని కాలక్రమేనా సెక్స్ వర్కర్లుగా పేరు మార్పిడి చేయడం జరిగిందని తెలిపారు. కానీ ఆ పదం సరైనది కాదని ఎవరు లేకపోవడంతో తప్పని పరిస్థితుల్లో కుటుంబ పోషణర్థం ఈ వృత్తిని ఎంచుకోవడం జరుగుతుందే తప్ప ఇతర కారణాలు ఉండవని వారు తెలిపారు. సమాజంలో వారికి కూడా హక్కులున్నాయని వాటిని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.. తమ దృష్టికి ఎలాంటి సమస్యలు తీసుకొచ్చిన తనవంతు బాధ్యతగా ఎలాంటి సహాయ సహకారాలు అందిస్తామని అయన హామీ ఇచ్చారు.. కుటుంబ పోషణ అని కాకుండా తమ ఆరోగ్యం పట్ల కూడా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు మరియు స్నేహ సొసైటీ ప్రాజెక్టు ఆధ్వర్యంలో కొనసాగుతున్న స్నేహ సొసైటీ టార్గెటేడ్ ఇంటర్వెన్షన్ ప్రాజెక్టు అధికారులు,సిబ్బంది సూచిస్తున్న సూచనలు తప్పక పాటించాలని సూచించారు..స్నేహ సొసైటీ కార్యదర్శి S.సిద్దయ్య 2006 నుండి ఈ వృత్తిపై ఆధారపడి అనారోగ్యాల బారిన పడకుండా ఉండేందుకు ఎంతో కృషి చేస్తున్నారని తెలిపారు. వారి కృషికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తునని చెప్పారు.. వారి ఆశయ సాధనలో భాగంగా మీ తర్వాత తరం ఈ వృత్తిని ఎంచుకోకుండా మంచి విద్యావంతులుగా ఎదిగేందుకు మీ పిల్లలను సైతం బడిబాట పట్టించరాని చెప్పారు. వారి ఆశయ సాధనకు మీ వంతు సహకారం ఉండాలని తెలిపారు.. సుప్రీంకోర్టు సైతం హక్కులు కల్పించిన మీరు హక్కులను సద్విని యోగం చేసుకోవాలి అలాగే మీరు మీ ఆరోగ్యాన్ని చూసుకుంటూ మీ పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని మంచి వృత్తిలోకి అడుగు పెట్టాలని హితవు పలికారు.. ఈ సమావేశంలో స్నేహ సొసైటీ టార్గెటేడ్ ఇంటర్వెన్షన్ ప్రాజెక్టు డైరెక్టర్ S. సిద్దయ్య, స్నేహ సొసైటీ దివ్యాంగుల పాఠశాల ప్రిన్సిపాల్ జ్యోతి మాట్లాడుతూ దేవుడి బిడ్డలుగా పేర్కొంటున్న సెక్స్ వర్కర్ల సమస్యలను వారి అభ్యున్నతి కోసం వారి తర్వాత తరం పిల్లల భవిష్యత్తు కోసం ఎప్పటికప్పుడు గౌరవ న్యాయమూర్తి మరియు కలెక్టర్ మరియు జిల్లా సాయి అధికారుల దృష్టికి స్థానిక ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుందని వారు తెలిపారు. గౌరవ న్యాయమూర్తి ప్రతి ఒక్కరు వీరి భవిష్యత్తు కోసం అన్ని రకాల సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నారని వారికి స్నేహ సొసైటీ తరఫున కృతజ్ఞతలు తెలియజేయడం జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో స్నేహ సొసైటీ ప్రిన్సిపాల్ జ్యోతి, హెచ్ఐవి ప్రోగ్రాం డిపిఎం సుధాకర్, వైస్ ప్రిన్సిపాల్ రాజేశ్వరి, స్నేహ సొసైటీ సభ్యులు తాటి వీరేశం, సఖి సెంటర్ అడ్మినిస్ట్రేటర్ భానుప్రియ, స్నేహ సొసైటీ టార్గెటేడ్ ఇంటర్వెన్షన్ ప్రాజెక్టు మేనేజర్ మోయిజ్, తదితరులు పాల్గొన్నారు.