సీపీఐ(ఎం) జిల్లా కార్యవర్గ సభ్యులు
నవతెలంగాణ-పరిగి
శిరీషను హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యవర్గ సభ్యులు వెంకటయ్య అన్నారు. బుధవారం మండల పరిధిలోని కాడ్లాపూర్ గ్రామంలో సీపీఐ(ఎం), వ్యవసాయ కార్మిక సంఘం, ఎల్‌హెచ్ పిఎస్, జీవీఎస్ సంఘాల ఆధ్వర్యంలో అనుమానాస్పదంగా మృతి చెందిన శిరీష కుటుంబ సభ్యులను పరామర్శించారు. అ నంతరం ఘటనాస్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం వెంకటయ్య, ఎల్‌హెచ్ పిఎస్ రాష్ట్ర కార్యదర్శి గోవింద్ నాయక్, జీవీఎస్ మండలాధ్యక్షుడు అనిల్ నాయక్ మాట్లాడుతూ దళిత కులానికి చెందిన శిరీషను హత్య చేయడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. శిరీష బావనే ఈ హత్యకు పూను కున్నాడని గ్రామస్తులు ఆరోపిస్తున్నారని తెలిపారు. పరిస్థితులను బట్టి చూస్తే అనీలే ఈ హత్య చేసుంటాడని తమకు కూడా అనుమానాలు ఉన్నాయని ఆరోపించారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిత్యం ఎక్కడా చూసిన మహిళలపై, దళితులపై దాడులు జరుగుతున్నాయన్నారు. మహిళల గురించి ఎన్ని చట్టాలు వచ్చినా వారికి భద్రత లేకుండా పోతుందన్నారు. ప్రభు త్వం ఉన్న చట్టాలను కఠినంగా అమలు చేయాలని డిమాం డ్ చేశారు. శిరీష కుటుంబానికి ప్రభుత్వం రూ.20 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని, 5 ఎకరాల భూమి ఇవ్వాలని, డబుల్ బెడ్రూంతో పాటు, ఒక ప్రభుత్వ ఉద్యోగం కల్పిం చాలని డిమాండ్ చేశారు. ఇంత పెద్ద ఘటన జరిగిన ఎమ్మెల్యేగాని, మాజీ ఎమ్మెల్యే కనీసం పరామర్శించక పోవ డం దుర్మార్గమన్నారు. ఎన్నికల అప్పుడు ఓట్ల కోసమే వస్తు న్నారు తప్ప, దళితుల పైన దాడులు, హత్యలు, లౌంగిక దాడులు జరిగిన రావడం లేదని విమర్శించారు. శిరీష మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. లేకపోతే సంఘాలతో కలిసి పెద్ద ఎత్తున ఆందో ళన నిర్వహిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కార్యక్ర మంలో వ్యవసాయం కార్మిక సంఘం జిల్లా నాయకులు రఘురాం, ఎల్‌హెచ్ పిఎస్ నాయకులు శంకర్, సాయి బాబా, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.