
నవతెలంగాణ-కమ్మర్ పల్లి : మండల కేంద్రం శివారులోని భరత్ పెట్రోల్ బంకు వద్ద గంజాయితో పట్టుబడ్డ ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసి రిమాండ్ కు పంపినట్లు కమ్మర్ పల్లి ఎస్ఐ రాజశేఖర్ తెలిపారు. ఆయన తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి….. ఎస్ఐ రాజశేఖర్ ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా కమ్మర్ పల్లి శివారులోని భరత్ పెట్రోల్ బంకు దగ్గర ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు.వారిని విచారించగా కోరుట్లకు చెందిన మొహమ్మద్ సాహెబ్ బార్, మహమ్మద్ ఇర్ఫాన్, ఐలాపూర్ కు చెందిన సిరిగిరి సందీప్ గుర్తించారు. వారిని తనిఖీ చేయగా వారి వద్ద గంజాయి ఉన్నట్టు తెలిసింది. వెంటనే కమ్మర్ పల్లి తహసిల్దార్ ఆధ్వర్యంలో వారి ముగ్గురిని అరెస్టు చేసి వారి వద్ద నుండి 300గ్రాముల గంజాయి, ఒక బైకు, మూడు సెల్ ఫోన్ లను స్వాధీనం చేసుకుని వారిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు. గంజాయితో సంబంధం ఉన్న వీరి మరో స్నేహితుడు ఐలాపూర్ కు చెందిన బన్నీగౌడ్ @ కేకే అను వ్యక్తి పరారీలో ఉన్నట్లు ఎస్ఐ తెలిపారు.