నవతెలంగాణ – తిరుపతి
ఏపీ తిరుపతిలో ఘోర ప్రమాదం జరిగింది. వరదయ్యపాలెం మండలం కువ్వాకుల్లి గ్రామంలోని ఓ బాణాసంచ గిడ్డింగిలో ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నది. ఈ ఘటనలో ముగ్గురు సజీవ దహనమయ్యారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని సూళ్లూరుపేట దవాఖానకు తరలించారు. స్థానికులు అగ్నిమాపక అధికారులు, పోలీసులకు సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అగ్నిప్రమాదం కారణంగా పేలుడు పదార్థాలు అంటుకొని భారీగా అగ్నికీలలు ఎగిసిపడుతున్నాయి. గోడౌన్‌లో ఆరుగురు పని చేస్తున్నారని స్థానికులు చెప్పారు. ప్రమాదానికి సంబంధించి కారణాలు తెలియరాలేదని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.