బాధితులకు మూడు సెల్ ఫోన్ లు అందజేత

నవతెలంగాణ – కంటేశ్వర్
నిజామాబాద్ నగరంలోని ఒకటవ పోలీస్ స్టేషన్ పరిధిలో మూడు సెల్ ఫోన్లు పోగా ఫిర్యాదుదారులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు ఒకటవ పోలీస్ స్టేషన్ ఎస్ హెచ్ ఓ విజయ్ బాబు తెలియజేశారు. కేసులు నమోదు చేసి దర్యాప్తు చేయగా మూడు సెల్ఫోన్లను సి ఈ ఐ ఆర్ అండ్ సిబ్బంది తమ విధులు నిర్వహించి మూడు సెల్ఫోన్లను ఎక్కడ ఉన్నాయో ట్రేస్ చేశారు. ట్రేస్ చేసిన మూడు సెల్ ఫోన్ లను బాధితులను ఒకటవ పోలీస్ స్టేషన్కు పిలిపించి ఎస్హెచ్ఓ విజయ్ బాబు మూడు సెల్ ఫోన్ లను బాధితులకు అందజేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రోజురోజుకు సెల్ఫోన్ చోరీలు ఎక్కువవుతున్న నేపథ్యంలో ఫోన్లు తమ వద్ద ఉంచుకోవాలని ఎప్పటికప్పుడు ఫోన్ ఉందో లేదో చెక్ చేసుకుంటూ ఉండాలని తెలిపారు. ఎక్కడో పెట్టి మర్చిపోయి సెల్ ఫోన్ పోయింది అని పోలీస్ స్టేషన్లో చుట్టూ తిరిగే బదులు మన వస్తువును మనమే జాగ్రత్తగా పెట్టుకోవాలని ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో బాధితులతో పాటు ఒకటవ పోలీస్ స్టేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Spread the love