తెలంగాణలో మూడు రోజులు మోస్తరు వర్షాలు

నవతెలంగాణ-హైదరాబాద్‌: తెలంగాణలో మరో మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాష్ట్రంలోని పశ్చిమ, దక్షిణ ప్రాంతంలోని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. గంటకు 40కి.మీ. నుంచి 50 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. రేపు, ఎల్లుండి కూడా గంటకు 30 కి.మీ. నుంచి 40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు, ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని ప్రకటించింది. రాగల మూడు రోజులు పగటి ఉష్ణోగ్రతలు 39 నుంచి 42 డిగ్రీల వరకు నమోదవుతాయని వివరించింది.

Spread the love