మూడు భిన్న ప్రేమ కథలు..

మూడు భిన్న ప్రేమ కథలు..హీరో టోవినో థామస్‌ నటించిన పాంటసీ ప్రాజెక్ట్‌ ‘ఏఆర్‌ఎం’. ఈ చిత్రంలో కతిశెట్టి, ఐశ్వర్య రాజేష్‌, సురభి లక్ష్మి హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. జితిన్‌ లాల్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగులో మైత్రీ మూవీ మేకర్స్‌ డిస్ట్రిబ్యూటర్స్‌ గ్రాండ్‌గా ఈనెల 12న విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా హీరో టోవినో థామస్‌ మీడియాతో పలు విశేషాలను షేర్‌ చేసుకున్నారు.
‘ఇది నా 50వ సినిమా కావడం ఆనందంగా ఉంది. ఇది చాలా ఎగ్జైటింగ్‌ స్క్రిప్ట్‌. మూడు డిఫరెంట్‌ క్యారెక్టర్స్‌ చేయడం హ్యూజ్‌ ఛాలెంజ్‌. డైరెక్టర్‌ నాపై నమ్మకం ఉంచారు. ఈ మూడు పాత్రలు దేనికవే ప్రత్యేకంగా ఉంటాయి. ఈ మూడు పాత్రలలో దొంగగా కనిపించే మణి పాత్ర కొంచెం ఎక్కువ ఇష్టం. తను చాలా కాన్ఫిడెన్స్‌ ఉన్న దొంగ. ఆడియన్స్‌ అ క్యారెక్టర్‌ని చాలా ఎంజారు చేస్తారు. ఇందులో చాలా ఫైట్స్‌ సీక్వెన్స్‌లు ఉన్నాయి. అందుకే కళరి నేర్చుకున్నాను. ట్రైలర్‌లో మూడు డిఫరెంట్‌ లవ్‌ స్టొరీస్‌ కనిపించాయి. ఈ ప్రేమకథల్లో కతి శెట్టి, ఐశ్వర్య రాజేష్‌, సురభి లక్ష్మి అద్భుతంగా నటించారు. ఈ సినిమాని త్రీడీలో రిలీజ్‌ చేస్తున్నాం. ఇంగ్లీష్‌. స్పానిష్‌ భాషల్లో కూడా విడుదల చేస్తున్నాం. దాదాపు ముఫ్ఫై భాషల్లో సబ్‌ టైటిల్స్‌ వేస్తున్నాం. యూనివర్శల్‌గా కనెక్ట్‌ అయ్యే సినిమా. ‘ఏఆర్‌ఎం’ అంటే ‘అజాయంతే రందం మోషణం’. అజయన్‌ రెండో దొంగతనం అని దీని అర్థం’.

Spread the love