రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి

– లారీని ఢకొీట్టిన బోలెరో వాహనం
– గొర్రెలు అమ్ముకుని తిరిగి స్వగ్రామానికి వస్తుండగా ఘటన
నవతెలంగాణ-షాద్‌నగర్‌
రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌ మున్సిపల్‌ పరిధిలోని సోలిపూర్‌ వద్ద శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బోలోరో వాహనం అదుపు తప్పి లారీని ఢకొీట్టింది. ఈ ఘటనలో ముగ్గురు మృతిచెందారు. షాద్‌నగర్‌ సీఐ నవీన్‌ కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. వనపర్తి, నాగర్‌కర్నూల్‌ జిల్లాలకు చెందిన అశోక్‌(28), శంకర్‌(32), రవి(30) గొర్రెలు అమ్మడానికి హైదరాబాద్‌కు వచ్చారు. శనివారం ఉదయం గొర్రెలు అమ్ముకుని తిరిగి సొంత ఊర్లకు వెళ్లే క్రమంలో హైదరాబాద్‌-బెంగళూర్‌ జాతీయ రహదారిపై వీరు ప్రమాణిస్తున్న బోలెరో వాహనం అదుపుతప్పి డివైడర్‌ను ఢకొీట్టి.. అనంతరం ఎదురుగా వస్తున్న లారీని సైతం ఢకొీట్టింది. ఈ ఘటనలో బోలెరో డ్రైవర్‌ అశోక్‌ అక్కడికక్కడే మృతిచెందాడు. తీవ్రంగా గాయపడిన శంకర్‌ను.. షాద్‌నగర్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా.. రవిని ఉస్మానియా జనరల్‌ ఆస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. కాగా, మృతులు గొర్రెలు అమ్మగా వచ్చిన రూ.1.92లక్షల నగదు వాహనంలోనే ఉంది. అయితే ముగ్గురూ చనిపోవడంతో డబ్బును అంబులెన్స్‌ పైలెట్‌ రమేష్‌యాదవ్‌, పజిల్‌ అహ్మద్‌ పోలీసులకు అప్పగించారు. నిజాయితీగా డబ్బును పోలీసులకు అందజేసిన అంబులెన్స్‌ సిబ్బందిని పలువురు అభినందించారు.

Spread the love