కరీంనగర్ లో ఘోర రోడ్డు ప్రమాదం..ముగ్గురు మృతి

నవతెలంగాణ-హైదరాబాద్ : కరీంనగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అర్థరాత్రి వేళ రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు మరణించారు. తిమ్మాపూర్ మండలం రేణికుంట బ్రిడ్జి సమీపంలో రాజీవ్ రహదారిపై అర్ధరాత్రి బైక్‌పై వెళ్తున్న ముగ్గురు వ్యక్తులను రాంగ్ రూట్లో వచ్చిన ఇసుక ట్రాక్టర్ ఢీకొట్టడంతో ఈ ప్రమాదంలో బైక్ పై ప్రయాణిస్తున్న ఒకరు అక్కడికక్కడే చనిపోగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయాలైన ఇద్దరు యువకులను కరీంనగర్ ప్రభుత్వ దవాఖానాకి చికిత్స కోసం తరలించారు. అయితే, చికిత్స పొందుతూ ఇద్దరు మృతి చెందారు. మృతులంతా ఒకే గ్రామానికి చెందిన వారుగా గుర్తించారు. చిగురుమామిడి మండలం రామంచ గ్రామానికి వారు అని స్థానికులు తెలిపారు. పని ముగించుకొని రేణిగుంటలో ఓ దాబాలో భోజనం చేసి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది.

Spread the love