నవతెలంగాణ-నవీపేట్: జవహర్ నవోదయ 6 వ తరగతిలో నవీపేట్ కు చెందిన ముగ్గురు విద్యార్థులు ఎంపికయ్యారు మండల కేంద్రంలోని స్కాలర్స్ పాఠశాలకు చెందిన రెమ్మ తేజస్విని, లిటిల్ ఫ్లవర్ పాఠశాలకు చెందిన ధీరజ్,యజ్ఞకృత్ లు ఎంపికైనట్లు పాఠశాలల కరస్పాండెంట్లు గురువారం తెలిపారు. విద్యార్థులు ఎంపిక కావడం పట్ల పాఠశాల యాజమాన్యంతో పాటు పలువురు అభినందించారు.