యశ్ బర్త్ డే వేడుకల్లో విషాదం.. బ్యానర్ కడుతూ విద్యుదాఘాతంతో ముగ్గురి మృతి

నవతెలంగాణ- హైదరాబాద్: ప్రముఖ కన్నడ నటుడు యశ్ బర్త్ డే వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. ఆయన 38వ బర్త్ డేను పురస్కరించుకుని అభిమానులు బ్యానర్ ఏర్పాటు చేస్తుండగా విద్యుదాఘాతానికి గురై ముగ్గురు అభిమానులు మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. కర్ణాటకలోని గడగ్ జిల్లా లక్ష్మేశ్మర్ తాలూకాలోని సురంగి గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Spread the love