పిడుగుపాటుకు ముగ్గురి మృతి

నవతెలంగాణ హైదరాబాద్: రాష్టంలోని పలు జిల్లాలో ఆదివారం మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. మెదక్‌ జిల్లాలోని పెద్దశంకరంపేట మండలం రామోజీపల్లిలో పిడుగుపాటుకు తండ్రీకుమారుడు మృతి చెందారు. మరోవైపు ఆదిలాబాద్‌ జిల్లా జైనథ్‌ మండలం గిమ్మ గ్రామంలో పిడుగుపాటుకు ఒకరు మృతి చెందగా నలుగురికి గాయాలయ్యాయి. సంగారెడ్డి, మెదక్‌ జిల్లాల్లోనూ గాలివాన బీభత్సం సృష్టించింది. పలు ప్రాంతాల్లో ఈదురు గాలులకు ధాన్యం రాశులపై కప్పిన టర్ఫాలిన్‌ కవర్లు ఎగిరిపోవడంతో ధాన్యం తడిచిపోయింది. సంగారెడ్డి జిల్లా నాగలిగిద్ద మండలం ముక్తాపూర్‌లో 5.1 సెం.మీ, మొగుడంపల్లిలో 2.6, మెదక్‌ జిల్లా పాపన్నపేట మండలం లింగాయిపల్లిలో 1.9 సెం.మీ వర్షపాతం నమోదైంది.

Spread the love