ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురి మృతి

నవతెలంగాణ – అమరావతి: పల్నాడు జిల్లా వినుకొండలోని కొత్తపాలెం వద్ద గురువారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఇన్నోవా కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అక్కడిక్కడే ముగ్గురు మృతి చెందగా.. మరో ఐదుగురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న సీఐ సాంబశివరావు ఘటన స్థలానికి చేరకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం వినుకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కర్ణాటకలోని బళ్లారి నుంచి గుంటూరుకు వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు పేర్కొన్నారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Spread the love