గుంటూరులో రోడ్డు ప్రమాదం.. ముగ్గురి మృతి

నవతెలంగాణ -అమరావతి : ఏటుకూరు వద్ద జాతీయ రహదారిపై ఈ రోజు ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. కంకర లోడుతో వెళ్తున్న ట్రాక్టర్‌ను కారు ఢీ కొంది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న వారిలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు మహిళలు, ఓ చిన్నారి ఉన్నారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని జీజీహెచ్‌కు తరలించారు. సమాచారం అందుకున్న పత్తిపాడు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. మృతులు మంగళగిరి వాసులుగా గుర్తించారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Spread the love