గంజాయి తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులు అరెస్ట్‌

నవతెలంగాణ-రాజేంద్రనగర్‌
ద్విచక్ర వాహనంపై గంజాయిని తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసే రిమాండ్‌కు తరించారు. ఈ ఘ టన రాజేంద్రనగర్‌ ఎక్సైజ్‌ పోలీస్‌ స్టేష న్‌ పరిధిలో చోటుచేసుకుంది. రం గారెడ్డి జిల్లా ఎక్సైజ్‌ అసిస్టెంట్‌ సూపరింటెండెంట్‌ శ్రీనివాస్‌ తెలిపిన వివరాల ప్రకారం శనివారం ఉదయం రాజేంద్ర నగర్‌ ఎక్సైజ్‌ పోలీసులు అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం గగన్‌పహాడ్‌ వద్ద వాహనాలను తనిఖీ చేస్తు న్నారు. అయితే ఒక బైక్‌పై అనుమాదాస్పదంగా ముగుగరు వ్యక్తులు వేగంగా వెళ్తున్నారు. వారిని ఆపి తనిఖీ చేయగా ఒక సంచిలో గంజాయి ప్యాకెట్లు లభ్యమయ్యా యి. ఉత్తరప్రదేశ్‌కు చెందిన అజరు పాటిల్‌, బీహార్‌కు చెందిన అనిల్‌ కుమార్‌, ఖలీల్‌ ఈ ముగ్గురు కలిసి గత కొంతకాలంగా ఇతర రాష్ట్రాల నుంచి గంజాయి తీసుకొని వచ్చి స్థానికంగా అమ్ముతున్నారు. దీంతో ఈ ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వీరి వద్ద నుంచి 2.7 కిలోల గంజాయి, బైక్‌, మూడు సెల్‌ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Spread the love