ఈశాన్య ఢిల్లీ అల్లర్ల కేసులో ముగ్గురి విడుదల

– ఢిల్లీ కోర్టు ఆదేశాలు
– దర్యాప్తు అధికారి సాక్ష్యాధారాలు తారుమారు చేశారంటూ అనుమానం
న్యూఢిల్లీ : ఈశాన్య ఢిల్లీలో 2020లో జరిగిన అల్లర్లకు సంబంధించిన కేసులో ముగ్గురు వ్యక్తులను ఢిల్లీ కోర్టు విడుదల చేసింది. సాక్ష్యాధారాలను ఢిల్లీ పోలీసుల దర్యాప్తు అధికారి తారుమారు చేశారన్న అనుమానాలను కోర్టు వ్యక్తం చేసింది. ముందుగా నిర్ణయించిన విధంగా, యాంత్రికమైన పద్ధతిలో వారిపై చార్జిషీట్లు దాఖలు చేశారని పేర్కొంది. దర్యాప్తును మరోసారి సమీక్షించాలంటూ న్యాయమూర్తి ఈ విషయాన్ని ఢిల్లీ పోలీసులకే తిరిగి నివేదించారు. ఈశాన్య ప్రాంత అల్లర్లలో ప్రమేయం వుందంటూ అఖిల్‌ అహ్మద్‌ అలియాస్‌ పాపడ్‌, రాహిష్‌ ఖాన్‌, ఇర్షాద్‌లను అరెస్టు చేశారు. చట్టవిరుద్ధంగా వారు సమావేశమయ్యారని, విధ్వంసానికి పాల్పడ్డారని వారిపై అభియోగాలు మోపారు. వారిపై నమోదైన చార్జిషీట్లకు, ఆ తర్వాత చేసిన ప్రకటనలకు పొంతన కుదరడం లేదని, పైగా చార్జిషీట్లు సమగ్రంగా లేవని, అనేక లొసుగులు వున్నా యని కోర్టు కనుగొంది. ప్రాసి క్యూషన్‌ కేసులో లోపాలను మాఫీ చేసే ప్రయత్నం జరగా లని సూచించారు. 2020 ఫిబ్ర వరి 28న అసిస్టెంట్‌ సబ్‌ ఇన్‌ స్పెక్టర్‌ సిద్ధం చేసిన ఫిర్యాదు కాపీ ప్రాతిపదికన దయాల్పూర్‌ పోలీసు స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. ఆ తర్వాత, పలు వురు చేసిన ఫిర్యాదులన్నింటినీ దర్యాప్తు అధికారి ఈ కేసులో కలిపేశారని కోర్టు పేర్కొంది. 2020 జులై 14న ఆ ముగ్గురిపై చార్జిషీట్‌ దాఖలు చేశారు. డిసెంబరు 9న దాన్నే పరిగణనలోకి తీసుకున్నారు. తర్వాత మరికొన్ని పత్రాలు, తాజా స్టేట్‌మెంట్‌లతోపాటు 2022 ఫిబ్రవరి 15న రెండు అనుబంధ చార్జిషీట్లు దాఖలు చేశారు.

Spread the love