నవతెలంగాణ – హైదరాబాద్: ఉప్పల్ రింగురోడ్డులోని స్కైవాక్ లిఫ్టులో ఏర్పడిన టెక్నికల్ ప్రాబ్లమ్ వలన అది మధ్యలోనే ఆగిపోయి, ముగ్గురు విద్యార్థులు దాంట్లో ఇరుక్కుపోయారు. చాలాసేపటి వరకు లిఫ్ట్ తెరుచుకోకపోవడంతో వారు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, ట్రాఫిక్ పోలీసులు అక్కడికి చేరుకొని ఎట్టకేలకు లిఫ్ట్ తెరిచి వారిని కాపాడారు. అకస్మాత్తుగా లిఫ్ట్ ఆగిపోవడంతో ఏం జరుగుతుందో అర్థం కాలేదని, లిఫ్టులో ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నంబరుకు కాల్ చేస్తే ఎవరూ స్పందించలేదని, భయపడి ఫైర్ సిబ్బందికి ఫోన్ చేశామని అందులోంచి బయటపడిన విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు జరిగినప్పటికీ అధికారులు పట్టించుకున్నట్టు కనబడటం లేదు.