నవతెలంగాణ – హైదరాబాద్: సికింద్రాబాద్ బోయిన్‌పల్లి భవానీనగర్‌లో దారుణం జరిగింది. తండ్రి చనిపోయాడన్న బాధతో తల్లితో సహా ఇద్దరు కుమార్తెలు ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికులను కలచివేసింది. తల్లి విజయలక్ష్మి, ఎంబీఏ చదువుతున్న కుమార్తె చంద్రకళ, వికలాంగురాలైన మరో కుమార్తె సౌజన్య ముగ్గురూ ఇంట్లోని ఒక్కో గదిలో ఒక్కొక్కరు ఆత్మహత్యకు పాల్పడ్డారు. విషయం బయటకు రాకుండా బోయిన్‌పల్లి పోలీసులు, కుటుంబ సభ్యులు గోప్యంగా ఉంచారు. పోస్టు మార్టం అనంతరం మృతదేహాలను వారి స్వస్థలం తూర్పుగోదావరి జిల్లాకు తరలించారు. గతంలో కూడా వీరు నిద్రమాత్రలు వేసుకుని ఆత్మహత్యకు యత్నించినట్టు తెలుస్తోంది.