థ్రిల్‌ చేసే అన్వేషి

Thrill seekerవిజయ్ ధరణ్‌ దాట్ల, సిమ్రాన్‌ గుప్తా, అనన్య నాగళ్ల హీరో, హీరోయిన్లుగా రూపొందుతున్న చిత్రం ‘అన్వేషి’. అరుణ శ్రీ ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌పై వి.జె.ఖన్నా దర్శకత్వంలో టి.గణపతి రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీని ప్రపంచ వ్యాప్తంగా నవంబర్‌ 10న గ్రాండ్‌గా రిలీజ్‌ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత టి.గణపతి రెడ్డి మాట్లాడుతూ, ‘నిర్మాతగా ఇది తొలి చిత్రం.
మా డైరెక్టర్‌ వి.జె.ఖన్నా మంచి కథ, స్క్రీన్‌ప్లేతో సినిమాని అద్భుతంగా తెరకెక్కించారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌, పాటకు సూపర్బ్‌ రెస్పాన్స్‌ వచ్చింది. చైతన్‌ భరద్వాజ్‌ సంగీతం, కె.కె.రావు సినిమాటోగ్రఫీ విజువల్స్‌ ఆకట్టు కుంటాయి’ అని అన్నారు.
‘హీరో విజయ్ ధరణ్‌, సిమ్రాన్‌ గుప్తా చక్కగా నటించారు. అనన్య నాగళ్ల ఈ సినిమాలో కీ పాత్రని పోషించారు. ఆమె చుట్టూనే కథ తిరుగుతుంటుంది. ఫారెస్ట్‌ బ్యాక్‌డ్రాప్‌లో నడిచే సినిమా. నిర్మాతలు రాజీపడకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు’ అని దర్శకుడు వి.జె.ఖన్నా చెప్పారు.

Spread the love