థ్రిల్‌ చేసే వధువు

థ్రిల్‌ చేసే వధువుడిస్నీ ఫ్లస్‌ హాట్‌ స్టార్‌ అందిస్తున్న మరో ఇంట్రెస్టింగ్‌ వెబ్‌ సిరీస్‌ ‘వధువు’. అవికా గోర్‌, నందు, అలీ రెజా కీలక పాత్రల్లో నటింఆరు. ఎస్వీఎఫ్‌ బ్యానర్‌లో శ్రీకాంత్‌ మొహ్తా, మహేంద్ర సోని నిర్మాణంలో పోలూరు కష్ణ రూపొందిం చారు. ఈ నెల 8వ తేదీ నుంచి ఈ వెబ్‌ సిరీస్‌ స్ట్రీమింగ్‌ కాబోతోంది. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో నందు మాట్లాడుతూ, ‘సవారీ, బొమ్మ బ్లాక్‌ బస్టర్‌ సినిమాల తర్వాత మరో ఇంట్రెస్టింగ్‌ మూవీ కోసం వెయిట్‌ చేస్తున్న టైమ్‌లో హాట్‌ స్టార్‌ నుంచి ఈ ఆఫర్‌ వచ్చింది. ఒక ఫ్యామిలీలో మెంబర్స్‌ ఇంత డిఫరెంట్‌గా ఎలా ఉన్నారు? ఇంత అనుమానస్పదంగా ఎందుకు ఉన్నారు అనేది మీకు ఆసక్తి కలిగిస్తుంది. ఇదే కాదు సీజన్‌ 2 ఇంకా బిగ్గర్‌ కాన్వాస్‌లో ఉంటుంది’ అని తెలిపారు. ‘ఈ సిరీస్‌లో నా క్యారెక్టర్‌ పర్‌ఫార్మెన్స్‌ చాలా సెటిల్డ్‌గా ఉంటుంది. ఈ సిరీస్‌ ష్యూర్‌ హిట్‌ అవుతుంది’ అని అలీ రెజా చెప్పారు. దర్శకుడు పోలూరు కష్ణ మాట్లాడుతూ,’బెంగాలీ వెబ్‌ సిరీస్‌ ‘ఇందు’ను ‘వధువు’గా రీమేక్‌ చేశాం. మన నేటివిటీకి తగినట్లు క్యారెక్టర్స్‌ డిజైన్‌ చేసుకున్నాం. చాలా గ్రిప్పింగ్‌గా సిరీస్‌ ఉంటుంది. సెకండ్‌ ఎపిసోడ్‌ నుంచి 7వ ఎపిసోడ్‌ వరకు అంతే క్యూరియస్‌గా కథ సాగుతుంది. 7వ ఎపిసోడ్‌ కిక్‌ ఇచ్చేలా ఉంటుంది. ఈ సిరీస్‌ను మీరు బాగా ఎంజారు చేస్తారని ఆశిస్తున్నాం’ అని అన్నారు.
‘ఈ వెబ్‌ సిరీస్‌కు వర్క్‌ చేసే అవకాశం ఇచ్చిన డైరెక్టర్‌కి, హాట్‌ స్టార్‌కు థ్యాంక్స్‌. ఆర్టిస్టుల పర్‌ఫార్మెన్స్‌ అదిరిపోతుంది. వాళ్ల పర్‌ఫార్మెన్స్‌ చూసి నేను ఇన్స్‌పైర్‌ అయి మ్యూజిక్‌ చేశాను’ అని మ్యూజిక్‌ డైరెక్టర్‌ శ్రీరామ్‌ మద్దూరి చెప్పారు.

Spread the love