– నీటి శుద్ధి కేంద్రాల నిర్వహణపై కొరవడుతున్న పర్యవేక్షణ
నవతెలంగాణ-సిరిసిల్ల : స్వచ్ఛమైన తాగు నీటితో అనారోగ్యం దడిచేరదని ప్రజల ప్రగాఢ నమ్మకం కానీ తాగే నీరు స్వచ్ఛమైనదో లేదో తెలియక అనారోగ్యాన్ని కొనితెచ్చుకుంటున్నారు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన నీటి శుద్ధి కేంద్రాల నిర్వహకులు నిబంధనలను తుంగలో తొక్కి ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నప్పటికీ పట్టించుకున్న నాథుడు కనిపించడం లేదు జిల్లాలో ప్రైవేటు మినరల్ నీటి విక్రయ కేంద్రాలు 130 వరకు నిర్వహిస్తున్నారు సిరిసిల్ల పట్టణంలోని ఓ కేంద్రం నిర్వాహకుడు ఏకంగా పురపాలక సంఘం నుంచి వచ్చే నీటి పైపుల ద్వారా నింపుతూ సొమ్ము చేసుకుంటున్నాడు సిరిసిల్ల పట్టణంలో 40 నీటి శుద్ధి కేంద్రాలు ఉండగా వేములవాడ పట్టణంలో నలభై ఉన్నాయి మిగతా మండలాల్లో 50 కేంద్రాలు ఉన్నాయి రోజువారి కూలీ పనులు చేసి జీవనం సాగించే పేదలు సైతం ఆర్థిక బరమైనప్పటికీ పది రూపాయల నుంచి 20 రూపాయలు వెచ్చించి ఈ నీటి కొనుగోలు చేస్తున్నారు జిల్లాలో ఐఎస్ఐ అనుమతులు ఉన్న కేంద్రాలు 20కి మించి లేవు మిగతా వాటిని అనుమతులు లేకుండా నిర్వహిస్తున్నారు. ప్రధానంగా ఇళ్లకు సరిపడా చేస్తున్న నీటితో పాటు దుకాణాల్లో విక్రయ కేంద్రాలకు అందించే నీటిలో నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి నీటిని శీతల యంత్రాల్లో ఉంచి విక్రయిస్తుండడంతో తాగే వారికి ఇది శుద్ధమైందో కాదో తెలియని పరిస్థితి నెలకొంది
కనిపించని నిబంధనలు….
డిడి శుద్ధి విక్రయ కేంద్రాలకు అనుమతులు ఇవ్వడంలో నిబంధనలు పాటించడం లేదు నిర్వాహకులకు ముందుగా అక్కడి భూగర్భ జలాలను పరీక్షలకు పంపిన తర్వాత ఆ జలం ఉపయోగకరమని తేలితేనే ప్లాంట్ లు ఏర్పాటుకు అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది కానీ ఇది ఒక వ్యాపార మార్గంగా మారడంతో ఎటువంటి పరీక్షలు లేకుండానే అనుమతులు తెచ్చుకుంటున్నారు ప్రస్తుతం ఈ కేంద్రాల ద్వారా సరఫరా చేస్తున్న తాగు నీటిలో సిహెచ్( ఆమ్లం స్థాయి మూడు నుంచి నాలుగు వరకు మాత్రమే ఉంటుంది) కానీ మిషన్ భగీరథ మున్సిపల్ పంచాయతీల ద్వారా సరఫరా అవుతున్న నీటిలో ఆమ్లస్థాయి 7 కు పైగానే ఉంటుందని నిపుణులు చెబుతున్నారు కొనుగోలు చేసిన తాగునీటి కన్నా నల్లాల ద్వారా సరఫరా అయ్యే నీటిని కాచి చల్లార్చి తాగితేనే మంచిదన్నారు ప్రతి లీడర్ నీటిలో కాల్షియం మోతాదు 75 మిల్లీగ్రాములు మెగ్నీషియం 30 మిల్లి గ్రామంలో ఐరన్ 0.5 మిల్లీగ్రామ్ ఉండాలి ఫ్లోరైడ్ మోతాదు ఒక్క మిల్లీగ్రామ్ కన్నా తక్కువ ఉండాలి కానీ ప్రస్తుతం జిల్లాలో విక్రయిస్తున్న నీటిలో ఇటువంటి నాణ్యత ప్రమాణాలు ఏవి పాటించడం లేదని ఆరోపణలు ఉన్నాయి నీటిని శుద్ధి చేసే యంత్రాలు విశాలమైన గదులు ల్యాబ్ టెక్నీషియన్లు మైక్రో బయాలజిస్టులు సూచనలు పాటిస్తూ ప్రతి మూడు నెలలకు ఒకసారి ఆయా నీటి స్వచ్ఛతను పరీక్షించి అనుమతులు కొనసాగించాల్సి ఉంటుంది కానీ ఎక్కడ ఇటువంటి పరిస్థితి కనిపించడం లేదు పైగా పురపాలక శాఖ అధికారులు మండలాల్లో గ్రామపంచాయతీల అధికారులు తరచూ తనిఖీలు చేస్తూ నాణ్యత ప్రమాణాలను పరిశీలించాలి ఏ ఒక్క నీటి శుద్ధి విక్రయ కేంద్రంలో కూడా తనిఖీలు చేపట్టిన దాఖలాలు లేవు నీడి శుద్ధి విక్రయ కేంద్రాల నిర్వహకులు ఇష్టానుసారంగా రసాయనాలు కలిపి మినరల్ వాటర్ గా సరఫరా చేస్తున్నరంతో ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందని ఇప్పటికైనా అధికారులు స్పందించి ఆయా కేంద్రాలను ఎప్పటికప్పుడు తనిఖీ చేసి నాణ్యత ప్రమాణాలు పాటించేలా చూడాల్సిన అవసరం ఉంది అదేవిధంగా అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న వాటిపై చర్యలు చేపట్టాలని పలువురు పేర్కొంటున్నారు