టీపీసీసీ లీగల్ సెల్ ద్వారా కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషిచేస్తామని హై కోర్టు న్యాయ వాది ఖాజా అహ్మద్ అన్నారు. బుధవారం పలువురు న్యాయవాదుల తో టీపీసీసీ హ్యూమన్ రైట్స్, ఆర్టీఐ చైర్మన్ పొన్నం అశోక్ గౌడ్ ను కలిసి పుష్పగుచ్చం అందజేశారు.ఈ సంధర్బంగా టీపీసీసీ స్టేట్ లీగల్ కన్వీనర్ ఖాజా అహ్మద్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా లీగల్ సెల్ తరపున ఉదృతంగా కార్యక్రమాలను నిర్వహించి పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మైనారిటీ విభాగం మాజీ సెక్రటరీ అర్హాన్ అహ్మద్ ,తెలంగాణ మైనారిటీ విభాగం మాజీ సెక్రటరీ మోమిన్ రోషన్ జమీర్,ఇతర న్యాయ వాదులు పాల్గొన్నారు.